పెరుగు వల్ల లాభాలు
మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే అవి మనకు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.అంతేకాకుండా దీన్ని సౌందర్యసాధనంగానూ వినియోగించవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో తోడ్పడటమే కాక శరీర సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి.
*పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేస్తే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతి వంతమవుతాయి.
* తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు పెరుగు దట్టించి తల స్నానం చేస్తే కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
*పెరుగులో శనగ పిండిని కలిపి నలుగు పిండిలా శరీరానికి అప్లై చేస్తే చర్మం, ముఖం మీదున్న నిర్జీవ కణాలు తొలగిపోతాయి.
*పెరుగులో తేనెని కలిపి వెంట్రుకలకు పూస్తే ఇది కండీషనర్‌గా పనిచేస్తుంది.
* ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీర చర్మంపై పూస్తే ఇది క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
*పెరుగులో కాస్త చక్కెర , ఉప్మా రవ్వ గాని కలిపి ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే డెడ్‌స్కిన్ తొలగిపోతుంది.
*పెరుగులో కాస్త పచ్చిపసుపును కలిపి నల్లటి వలయాల చుట్టూ రాస్తే నలుపుదనం తగ్గుతుంది.
*ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్ క్యూబ్‌ని వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

No comments:
Post a Comment