Wednesday, 27 September 2017

ఆదిత్య హృదయం చదివితే ఏమవుతుంది...

శ్రీకృష్ణుడు భగవద్గీతని ఏ సందర్భంలో చెప్పాడో మనందరికీ తెలిసిందే! కురుక్షేత్ర సంగ్రామంలో తన రక్తసంబంధీకులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు విముఖుడు కావడంతో... తనని కార్యోన్ముఖుని చేసేందుకు సాగిన బోధే భగవద్గీత. రామాయణంలోనూ ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. ఆ సమయంలో వెలువడిన స్తోత్రమే ఆదిత్య హృదయం.

అది రామాయణంలోని యుద్ధకాండ. లంకలోకి అడుగుపెట్టిన రాముని ఎదుర్కొనేందుకు, రావణుడు భీకరమైన రాక్షసులందరినీ యుద్ధభూమికి పంపాడు. అలా తన మీదకు వచ్చినవారిని వచ్చినట్లుగా సంహరిస్తున్నాడు రాముడు. ఒకపక్క వారితో యుద్ధం చేస్తున్న ఆయన శరీరం అలసిపోతోంది. అంతకుమించి తన కళ్లెదుట జరుగుతున్న మారణహోమాన్ని చూసి మనసు చలించిపోతోంది. దాంతో యుద్ధం పట్ల విముఖత మొదలైంది.

అగస్త్య మహాముని రాములవారి మానసిక స్థితిని గమనించాడు. నిదానంగా ఆయన చెంతకు చేరుకుని ఆ ఆదిత్యుని కనుక ప్రార్థిస్తే ఎనలేని శక్తి లభిస్తుందనీ, అంతులేని విజయాలు పొందవచ్చనీ సూచించాడు. అలా చెబుతూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అందించాడు. ఈ ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి ఆరు శ్లోకాలలోనూ ఆదిత్యుని పూజించమన్న సూచన కనిపిస్తుంది. 7వ శక్లోకం నుంచి 14వ శ్లోకం వరకూ ఆదిత్యుని ప్రశస్తి కనిపిస్తుంది. 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకూ ఆదిత్యుని ప్రార్థన సాగుతుంది. 22వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకూ ఆదిత్యహృదయాన్ని పఠిస్తే కలిగే శుభాల గురించిన వర్ణన ఉంటుంది. ఇదంతా విన్న రాములవారు కార్యోన్ముఖులు కావడాన్ని 29, 30 శ్లోకాలలో గమనించవచ్చు.

ఈ ఆదిత్య హృదయం పఠించిన తర్వాత రాముడికి విజయం అనాయాసంగా లభించిందని వేరే చెప్పాలా! రాములవారికే శుభాన్ని అందిస్తే ఇక సామాన్యులు అనుమానించాల్సిన పని ఏముంది. అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా... ఎలాంటి ఒడిదొడుకులలోనైనా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకి చేరుస్తుందన్నది పెద్దల మాట. శత్రువినాశనం కావాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా, మనోవాంఛలు తీరాలన్నా ఆదిత్య హృదయం తారకమంత్రంలా పనిచేస్తుందని తరతరాల నమ్మకం.

‘మూడుసార్లు కనుక ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఈ సంగ్రామంలో విజయం సాధిస్తావు’ అంటూ సాక్షాత్తూ అగస్త్య మహర్షే 26వ శ్లోకంలో (ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి) పేర్కొంటాడు. మన అవసరాన్నీ, అవకాశాన్నీ బట్టి ఎన్నిసార్లయినా ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి.... సూర్యునికి అభిముఖంగా నిలిచి ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతారు.

ఇంతకీ రాములవారే ఓ అవతారపురుషుడు కదా! మరి ఆయన ఆదిత్యుని కొలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం రాక మానదు. ఆ సందేహానికి సమాధానం ఈ స్తోత్రంలోనే కనిపిస్తుంది. ఆదిత్య హృదయం అంటే ఆదిత్యుని హృదయం అన్న అర్థంతో పాటు ‘ఆదిత్యుని కలిగి ఉన్న హృదయం’ అన్న అర్థం కూడా వస్తుంది. ప్రతి మనిషిలోనూ ఉన్న పరబ్రహ్మకు ప్రతిరూపమే ఆ ఆదిత్యుడు. ‘ఈ దేహం నాది’ అనుకున్నప్పుడు మనం ఈ సృష్టికంటే భిన్నమైనవారం అనుకుంటాము. కానీ ‘ఈ సృష్టికి నేను కూడా ఒక ప్రతీకని’ అనుకున్నప్పుడు ఎలాంటి ఎల్లలూ లేని ఆత్మస్వరూపాన్ని దర్శించటగలం.

ఆదిత్యుడు అన్న పేరుని వాడటం వెనుక ఉద్దేశం ఇదే కావచ్చు! ఆదిత్యుడు అంటే ఆద్యంతాలు లేనివాడు అని అర్థం. ఆ ఆదిత్యుని మనలోనే దర్శించిన రోజున ఎలాంటి పరిమితులూ మనకి అడ్డంరావు. అందుకే సమస్త దేవతలకూ ప్రతీకగా, అజ్ఞానాన్ని రూపుమావేవాడిగా, సకల ప్రాణులలో ఉండే అంతర్యామిగా, సృష్టిస్థితిలయకారునిగా... ఆ ఆదిత్యుని ఈ స్తోత్రంలో పేర్కొన్నారు.

Tuesday, 26 September 2017

habits

                   
ఖర్చయ్యే తీరు మన వయసు మీద ఆధారపడి ఉంటుంది. దాన్నిబట్టే మనం తినే ఆహారం, తీసుకునే పోషకాలు, చేసే వ్యాయామాల్లో మార్పులు చేస్తూ ఉండాలి. జీవితంలోని దశలవారీగా వారి వారి జీవనశైలిని బట్టి ఏ వయసు వాళ్లు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏది తినాలి? ఏది తినకూడదు? జంక్‌ ఫుడ్‌కు గుడ్‌బై కొట్టి, వయసును బట్టి తింటే.. ఆరోగ్యం సదా మీ వెంటే! మీ ఇంటే!!
పది నుంచి పదిహేను ఏళ్లు... ఇది పిల్లలు ఎదిగే వయసు. ఈ దశలో పిల్లల ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. పిల్లల ఎదుగుదల ఏడాది వయసు వేగంగా ఉండి, పదేళ్లు చేరుకునేవరకూ నెమ్మదిస్తుంది. పదో ఏట నుంచి తిరిగి వేగం పుంజుకుంటుంది. కాబట్టి ఈ వయసు నుంచి పిల్లలకు ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.





ఈ దశలో పిల్లలకు బలవర్ధకమైన ఆహారం ఇస్తే మంచి ఎత్తు పెరుగుతారు, బలంగా తయారవుతారు.
మున్ముందు ఆడపిల్లలు ఎదిగి గర్భం దాల్చినప్పుడు, పిల్లలకు పాలిచ్చే సమయానికి ఎలాంటి బలహీనతలూ, ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండాలంటే పదేళ్ల వయసు నుంచే మాంసకృత్తులు ఉన్న ఆహారం ఇవ్వాలి.
ఇప్పుడు పిల్లలు తినే ఆహారంలో ప్రొటీన్లు తక్కువ పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి ఆహారం తినటం వల్ల పిల్లల్లో వయసుకు తగిన పెరుగుదల ఉండదు. అధిక బరువు, హార్మోన్లలో మార్పుల లాంటి సమస్యలు పదేళ్ల వయసు నుంచే మొదలవుతాయి. కాబట్టి ఈ వయసు నుంచే సమతులాహారం ఇస్తూ ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోగలిగితే భవిష్యత్తులో హైపర్‌టెన్షన్‌, మధుమేహం, రక్తపోటు మొదలైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే ఆ వయసు పిల్లల శరీర జీవక్రియలకు తగిన ఆహారం ఇవ్వగలిగితే హార్మోన్లు సక్రమంగా స్రవించి అనవసరమైన ఆహార వ్యసనాలు కూడా రాకుండా ఉంటాయి.
కొంతమంది పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు, స్వీట్లు, చీజ్‌, ఉప్పు, మైదాతో చేసిన పదార్థాలను ఏరికోరి తింటూ ఉంటారు. వాళ్ల శరీర జీవక్రియలకు తగినన్ని పోషకాలు శరీరానికి అందకపోవటమే ఇలాంటి ఫుడ్‌ క్రేవింగ్స్‌కు (ఆహార వ్యసనాలు) కారణం. కాబట్టి ఈ వయసులో పిల్లలకు ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న సమతులాహారం ఇవ్వాలి.



ఇందుకోసం... ఈ కింది పదార్థాలు ఇవ్వాలి

గుడ్లు, ఆకుకూరలు, తాజా పళ్లు, కూరగాయలు
బాదం, వాల్‌నట్స్‌, వేరుసెనగలు
గోధుమలు, పెసలు, పాలు, వెన్న, పెరుగు
మాంసం, చేపలు, జున్ను
రాజ్మా, సెనగలు, బొబ్బర్లు
పిల్లలకు సాయంత్రం అల్పాహారంగా బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఉడకబెట్టిన సెనగలు, మొక్కజొన్నలాంటివి ఇస్తే జంక్‌ ఫుడ్స్‌ మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది. పిల్లలు జంక్‌ఫుడ్‌కి అలవాటు పడిన తర్వాత వాళ్ల ఆహారంలో మార్పులు చేయటం కాకుండా అంతకంటే ముందే ఇలాంటి ఆహార నియమాలను వాళ్లకు అలవాటు చేయగలిగితే జంక్‌ ఫుడ్‌కి అలవాటు పడకుండా ఉంటారు.



15 నుంచి 25 ఏళ్ల వయసులో


బేకరీలు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, చాట్‌ బండ్లు....ఎక్కడ చూసినా ఎక్కువ శాతం టీనేజర్లే కనిపిస్తూ ఉంటారు. ఇంట్లో దొరకని కొత్త రుచులు ఆస్వాదించాలని ఆశపడటం ఈ వయసు పిల్లల్లో సహజమే! అయితే కేక్‌లు, బర్గర్లు, పిజ్జాలు, చాట్‌లు, మిల్క్‌షేక్స్‌, ఐస్‌క్రీమ్‌లు మొదలైన పదార్థాలు తినటం వల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరిపోతూ ఉంటాయి. వాటిని కరిగించటానికి సరిపడా వ్యాయామం కొరవడటంతో టీనేజీ పిల్లలు ఊబకాయుల్లా తయారవుతున్నారు.


జంక్‌ ఫుడ్‌కు టీనేజన్లు అలవాటు పడకుండా ఉండాలంటే ఇంట్లోనే కొత్త రుచుల్లో స్నాక్స్‌ తయారుచేయటం ప్రతి తల్లీ నేర్చుకోవాలి. తక్కువ నూనె, తీపి, మసాలాలతో రుచికరమైన స్నాక్స్‌ వండే విధానాలను నేర్చుకుని పిల్లల మనసు గెలవగలిగితే బజార్లో దొరికే ఫాస్ట్‌ ఫుడ్స్‌కు పిల్లలు ఆకర్షితులవకుండా ఉంటారు.
అలాగే మాంసాహారం వండేటప్పుడు ఎక్కువ నూనెలో వేయించకుండా కూరలా, ఆవిరి మీద ఉడికించి ఇవ్వాలి. మాంసాహారంతోపాటు కూరగాయలు కూడా ఇవ్వాలి.
ఆహారంలో తగినంత పీచు పదార్థం ఉండేలా చూసుకుంటే ప్రొటీన్‌ ఫుడ్‌ వల్ల మలబద్ధకం తలెత్తకుండా ఉంటుంది.
ఉదయం అల్పాహారంలో బ్రెడ్‌, శాండ్‌విచ్‌లకు బదులుగా గోధుమ రవ్వతో చేసిన ఉప్మా, పెసలతో చేసిన పొంగల్‌, పెసరట్టు, రాగి, క్యారట్‌ ఇడ్లీ లాంటివి ఇవ్వాలి.
కేక్‌లు తయారు చేసేటప్పుడు వాటిలో డ్రై ఫ్రూట్స్‌, పళ్ల ముక్కలు ఎక్కువగా వాడాలి. బాదం, పిస్తా, వాల్‌నట్స్‌, ఉడకబెట్టిన సెనగలు, మొలకలు పిల్లలకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి.
ఫ్రిజ్‌ ట్రేలలో చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా పళ్లు, సలాడ్లు, పాలు, గుడ్లు ఉంచాలి.
మాంసాహారం బలవర్ధకం అని బిరియాని, బటర్‌ చికెన్‌లాంటి కొవ్వు, నూనెలు ఎక్కువగా ఉండేలా వండి వడ్డించకూడదు. ఆవిరి మీద ఉడికించి, తక్కువ నూనెలో వేయించి ఇవ్వాలి.
చక్కెర కలపని పళ్ల రసాలు, చెరుకు రసం, టమాటా రసం లాంటివి ఇవ్వాలి.
టీనేజర్లు ఎక్కువగా ఆటలాడుతూ ఉంటారు కాబట్టి రోజుకి కనీసం గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ తినేలా చూసుకోవాలి. ఉదయం, సాయంత్రం కలిపి కనీసం అర లీటరు పాలు తాగేలా చూసుకోవాలి.
ఉడికించిన సెనగలు, బొబ్బర్లు ఎక్కువ సమయంపాటు శక్తినిస్తాయి. కాబట్టి బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌లాంటి ఆటల్లో పాల్గొనే పిల్లలకు వీటిని శ్నాక్స్‌గా ఇస్తూ ఉండాలి.
కొంతమంది టీనేజర్లు...మరీ ముఖ్యంగా అమ్మాయిలు బరువు పెరిగిపోతామనే బెంగతో తగినంత ఆహారం తీసుకోకుండా పోషక లోపాలకు గురవుతూ ఉంటారు. ఇలాంటి టీనేజర్లను కనిపెట్టి తల్లులు పౌష్టికాహారం వల్ల భవిష్యత్తులో ఒరిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించాలి.
చిన్న వయసు నుంచే శరీరానికి పోషకాలు అందిస్తూ గర్భం దాల్చే సమయానికి శరీరాన్ని ఎలా సన్నద్ధం చేయాలో, అలా చేయకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో వివరించాలి.
కొంతమంది టీనేజర్లు ఉదయం అల్పాహారం తినకుండా ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది రాత్రి భోజనం మానేయటం లేదా ఆలస్యంగా తినటం చేస్తూ ఉంటారు. ఇలాంటి అలవాట్లన్నీ ఆరోగ్యాన్ని దెబ్బ తీసేవే! కాబట్టి టీనేజర్లకు నియమిత సమయాల్లో ఆహారం తినటం ఎంత అవసరమో వివరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనే ఉదయం అల్పాహారం స్కిప్‌ చేయకుండా చూసుకోవాలి.
టీనేజర్లు ఎక్కువ సమయం కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లలో గడిపేస్తూ ఉంటారు. దాంతో శారీరక వ్యాయామం కూడా కొరవడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే రోజుకి కనీసం గంటపాటైనా శారీరక వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. మగపిల్లలు తాము తగినంత ఎత్తు పెరగట్లేదని, కండలు రావట్లేదని కంగారు పడుతూ వైద్యుల్ని కలుస్తూ ఉంటారు. ఈ సమస్యలకి కారణం పోషకాహార లోపమే! తగినంత క్యాల్షియం, ప్రొటీన్‌ తీసుకుంటూ వ్యాయామం చేస్తే ఎత్తు పెరగటంతోపాటు, చక్కటి శరీర సౌష్టవం కూడా సొంతమవుతుంది.
అలాగే ఉదయం లేచిన వెంటనే సాధ్యమైనంత త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయాలి. అలా చేయకపోతే ఒబేసిటీ, హైపర్‌టెన్షన్‌ సమస్యలు మొదలవుతాయి. అలాగే రాత్రి భోజనం కూడా 8 గంటల్లోపే ముగించాలి. ఇలా చేస్తే పొత్తికడుపులో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.



30 నుంచి 40 ఏళ్ల వయసులో


మధ్య వయస్కుల ఆహార అవసరాల్లో తేడాలుంటాయి. ఎక్కువశాతం మంది ఉద్యోగం, ఇల్లు...రెండు బాధ్యతలు సమంగా నిర్వహించాలి కాబట్టి ఆ బాధ్యతల వల్ల ఒత్తిడి వాళ్ల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమైపోతుంది.

ఒత్తిడి వల్ల హోర్మోన్లలో అవకతవకలు, అతి ఆకలి, ఆకలి మీద నియంత్రణ కోల్పోయి కనిపించిన ప్రతిదీ తినేయటం మొదలైన సమస్యలు ఈ వయసులోనే మొదలవుతాయి.
ఇలాంటి ఆహారశైలి వల్ల ఐరన్‌, క్యాల్షియం, విటమిన్‌ డి, ప్రొటీన్ల లోపం ఏర్పడి...30 ఏళ్లకే థైరాయిడ్‌ సమస్యలు తలెత్తుతాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకు కాన్పుల వల్ల ఐరన్‌, క్యాల్షియం లోపాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఈ లోట్లను భర్తీ చేయటం కోసం అన్ని రకాల ఆకుకూరలు, తృణధాన్యాలు, మాంసం, గుడ్డులోని తెల్లసొన, చేపలు, నట్స్‌ తీసుకుంటూ ఉండాలి. ఎముకల పటుత్వం కోసం వెయిట్‌ ట్రైనింగ్‌ తప్పనిసరిగా చేయాలి.
అలాగే గర్భం వల్ల పెరిగిన శరీర బరువును ప్రసవం అయిన తర్వాత సంవత్సరంలోగా తగ్గించుకోవాలి.
యోగా, మెడిటేషన్‌ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఉద్యోగినులైతే సాయంత్రం వేళ ఆఫీసు నుంచి రాగానే తేలికపాటి స్నాక్స్‌ తినాలి. రాత్రివేళ కుటుంబ సభ్యులందరూ భోజనం చేసేవరకూ ఆగకుండా వీలైనంత త్వరగా భోజనం ముగించాలి.
మధ్య వయస్కుల్లో జీర్ణశక్తి కొంత తక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి పూట ఆహారం త్వరగా తినేయాలి.
అలాగే రోజంతా ఎనర్జీ లెవెల్స్‌ సమతూకంలో ఉండటం కోసం ప్రతి రెండు గంటలకోసారి స్వల్ప పరిమాణాల్లో ఆహారం తినటం అలవాటు చేసుకోవాలి.
గుమ్మడి, పుచ్చ, అవిసె గింజలు కూడా ఆహారంలో చేర్చుకుంటే వాటిలోని ఒమేగా3 యాసిడ్స్‌ వల్ల బడలిక, అలసట, కీళ్ల నొప్పులు దరి చేరకుండా ఉంటాయి.




45 ఏళ్ల నుంచి వృద్ధాప్యం వరకూ స్త్రీలలో మెనోపాజ్‌ దశలో హార్మోన్ల స్రావాలు తగ్గిపోతాయి కాబట్టి శరీరం కాల్షియంను శోషించుకునే శక్తి కోల్పోతుంది. ఫలితంగా ఎముకలు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. పురుషుల్లో కండరాలు పటుత్వం కోల్పోతాయి.
కొవ్వులు శరీరంలో నిల్వ ఉండిపోతాయి. కాబట్టి శరీరం శోషించుకోగల క్యాల్షియంను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవటం అవసరం. దీంతోపాటు మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాల సప్లిమెంట్లను వైద్యుల సూచన మేరకు వాడాలి.
ఈ వయస్కుల్లో జీర్ణశక్తి కూడా తగ్గుతుంది. మలబద్ధకం సమస్య వేధిస్తుంది. కాబట్టి తేలికగా అరిగే ఆహారం, పీచు పదార్థాలు తీసుకోవాలి.
బయటి ఆహారం పూర్తిగా మానేసి ఇంట్లో తయారైనవే తినాలి. సమతులాహారంతోపాటు శక్తినిచ్చే పళ్ల రసాలు, మజ్జిగ తీసుకోవాలి. ఉప్పు తగ్గించాలి.
రోజూ కనీసం 45 నిమిషాలపాటైనా నడవాలి.
ఉప్పు, కారాలు, మసాలాలు వీలైనంత తక్కువ వాడి వండిన పదార్థాలే తినాలి.
నమిలి తినటానికి గట్టిగా ఉన్న పదార్థాలు అరగటానికీ మొరాయిస్తాయి. కాబట్టి ఈ వయస్కులు మెత్తగా ఉండే పదార్థాలనే తినాలి.
రాత్రి పూట 6 నుంచి 7 గంటల లోపు భోజనం చేసి, పడుకునేముందు పాలు తాగటం లేదా పళ్లు తినటం చేయాలి.
రాత్రిపూట పండిన అరటిపండు తినటం ద్వారా మలబద్ధక సమస్య తలెత్తకుండా చూసుకోవచ్చు.
రాత్రి భోజనం చేసిన వెంటనే కాకుండా రెండు గంటల తర్వాత పడుకోవాలి.
భోజనం చేసిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు నడవాలి.
ఈ వయస్కుల్లో కంటి చూపు, జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. బీటా కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కాలిఫ్లవర్‌, క్యారెట్‌, చిలకడ దుంపలు, గుమ్మడికాయ మొదలైనవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
వాల్‌నట్స్‌, బాదం కూడా ఎక్కువగా తినాలి.




ఆ సమయంలో...


పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఆ సమయంలో స్వీట్లు, నెయ్యి ఎక్కువగా తినిపించేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకపోయినా ఆ ఆహార సంప్రదాయం ఇప్పటికే అలాగే కొనసాగుతోంది.

నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకూ విపరీతంగా స్వీట్లు, నేతి పదార్థాలు పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను ఇంటికే పరిమితం చేసేస్తారు. దాంతో పిల్లలు ఆ కొద్ది రోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతోపాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు. అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.
రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి మిగతా పిల్లలతోపాటే ప్రొటీన్లు ఎక్కువగా ఇవ్వాలి.
రజస్వల సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్‌ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి.
ఎక్కువశాతం ఆడపిల్లలు 9, 10 ఏళ్ల వయసులోనే రజస్వల అవుతున్నారు. ఇందుకు కారణం క్యాల్షియం, విటమిన్‌ డి లోపం. ఈ లోపాల వల్ల రక్తం గడ్డ కట్టడం ఆగుతుంది. దాంతో ఆగకుండా రుతుస్రావం అవటం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
ఈ లోపాలు రాకుండా ఉండాలంటే రోజుకి కనీసం అర లీటరు పాలు పిల్లల చేత తాగించాలి. వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి.
ఆహారంలో పుదీనా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.
శరీరాన్ని చల్లగా ఉంచటం కోసం బీటా కెరోటీన్‌ ఎక్కువగా నారింజ లాంటి పళ్లు ఎక్కువగా ఇవ్వాలి

స్నానంతో సాంత్వన...

స్నానంతో సాంత్వన...

డావుడిగా... ఐదారు మగ్గులు గుమ్మరించుకుని ఇవతలకు వచ్చేసి స్నానం పూర్తయ్యిందంటే ఎలా! స్నానంతో శరీరానికి సాంత్వన లభించాలి. అందుకే ఆ నీటిలో.. అప్పుడప్పుడు కొన్నిరకాల పదార్థాలు వేసుకోండి. అవేంటో.. వాటివల్ల కలిగే మేలు గురించి తెలియాలంటే.. ఇది చదవాల్సిందే.
కప్పు రాక్‌సాల్ట్‌ను స్నానం చేసే నీటికి కలపాలి. దీనివల్ల శరీరం శుభ్రపడుతుంది. అలసటా దూరమవుతుంది.
రోజంతా తాజాదనంతో మెరిసిపోవాలనుకుంటున్నారా! బకెెట్‌ నీటిలో కప్పు పాలపొడి వేయండి. వెన్న తీసిన పాలైనా ఫరవాలేదు. అదీ కుదరకపోతే.. స్నానం చేసేముందు చర్మానికి పచ్చిపాలు రాసుకోండి.
ఎండకారణంగా కమిలిన చర్మానికి ఏం చేయాలో తెలుసా.. కొద్దిగా కలబంద గుజ్జును బకెట్‌ నీటికి చేర్చండి. ఈ గుజ్జులోని మాయిశ్చరైజింగ్‌ సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి కూడా.
రోజంతా పడిన అలసట.. ఒత్తిడి దూరం కావాలనుకుంటే.. గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది.
శరీరాన్ని శుభ్రపరచడంతోపాటు.. మృదువుగా.. ప్రకాశవంతంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుంది కామొమైల్‌. అందుకే వారానికోసారి పది చుక్కల కామొమైల్‌ నూనెను నీటిలో వేసుకుని స్నానించండి. పొడిచర్మాన్నీ నివారించిన వారవుతారు. నూనె అందుబాటులో లేకపోతే.. కామొమైల్‌ టీని చల్లని నీటికి చేర్చి స్నానం చేయండి.
శరీరం నుంచి దుర్వాసన వస్తోందా. దీనికి సరైన పరిష్కారం యూకలిప్టస్‌ నూనె. ఇందులోని యాంటీసెప్టిక్‌ సుగుణాలు.. వాసనను దూరం చేస్తాయి.
మేనికి మేలుచేయడంతోపాటు.. బ్లెమిషెస్‌ మచ్చల్ని కొంతవరకు తగ్గించడంలో తోడ్పడతాయి ఓట్స్‌. కాబట్టి ప్యాక్‌గానే కాకుండా.. అప్పుడప్పుడు ఇలానూ వాడండి.
తలనొప్పిని దూరం చేయడంతోపాటు.. జుట్టు కుదుళ్లకూ ఆరోగ్యాన్నందిస్తుంది రోజ్‌మేరీ నూనె. నాలుగైదు చుక్కల నూనె నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఫలితం లభిస్తుంది.
శారీరక, మానసిక సాంత్వన లభించాలంటే.. ఐదారు చుక్కల నిమ్మనూనె కలిపిన నీటితో స్నానం చేయడమే పరిష్కారం. బదులుగా చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలు... నిమ్మరసం కూడా వాడవచ్చు.
చిన్నచిన్న చర్మసంబంధ సమస్యలు ఇట్టే దూరమవుతాయి గులాబీరేకలతో. ఆలస్యమెందుకు.. గుప్పెడు గులాబీరేకల్ని బకెట్‌ నీటిలో కలిపి స్నానం చేసి చూడండి. గుబాళింపుతో పాటు.. శరీరానికి మేలు జరుగుతుంది.
రోజంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు స్నానం చేసే నీటిలో.. కప్పు సిడార్‌ వెనిగర్‌ కలిపి చూడండి. ఇంద్రియాలకు సాంత్వననందించడం.. రోజంతా చురుగ్గా ఉంచడం.. లాంటివన్నీ దాని ప్రత్యేకతలు

పెరుగు వల్ల లాభాలు

                                          పెరుగు వల్ల లాభాలు


మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఎన్నో రకాల పోషక పదార్థాలు ఉంటాయి. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే అవి మనకు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. మనం నిత్యం ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.అంతేకాకుండా దీన్ని సౌందర్యసాధనంగానూ వినియోగించవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచటంలో తోడ్పడటమే కాక శరీర సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తాయి. 

*పెరుగులో నిమ్మకాయ రసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేస్తే శరీరం, చర్మం మృదువుగా మారి కాంతి వంతమవుతాయి.
* తలస్నానం చేయడానికి ఒక గంట ముందు తలకు పెరుగు దట్టించి తల స్నానం చేస్తే కండీషనర్‌      ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.
*పెరుగులో శనగ పిండిని కలిపి నలుగు పిండిలా శరీరానికి అప్లై చేస్తే చర్మం, ముఖం మీదున్న నిర్జీవ కణాలు తొలగిపోతాయి.
*పెరుగులో తేనెని కలిపి వెంట్రుకలకు పూస్తే ఇది కండీషనర్‌గా పనిచేస్తుంది.
* ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి శరీర చర్మంపై పూస్తే ఇది క్లెన్సింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
*పెరుగులో కాస్త చక్కెర , ఉప్మా రవ్వ గాని కలిపి ముఖానికి పట్టించి మసాజ్‌ చేస్తే డెడ్‌స్కిన్‌ తొలగిపోతుంది.
*పెరుగులో కాస్త పచ్చిపసుపును కలిపి నల్లటి వలయాల చుట్టూ రాస్తే నలుపుదనం తగ్గుతుంది.
*ఎండలోంచి నీడలోకి వెళ్లగానే పెరుగులో ఐస్‌ క్యూబ్‌ని వేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్‌ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

జీవిత ఉపయెాగాలు

                                       జీవిత ఉపయెాగాలు

1. ఉదయం లేచిన వెంటనే నీరు ఎలా త్రాగాలి
జ. గోరు వెచ్చనివి.

2.నీరు త్రాగేవిధానము
జ. క్రింద కూర్చుని నెమ్మదిగా త్రాగాలి.

3.ఆహరం ఎన్ని సార్లు నమలాలి
జ.32 సార్లు.

4. భోజనం నిండుగ ఎప్పుడు తినాలి
జ. ఉదయం.

5. ఉదయం ఎన్ని గంటలలోపు టిఫిన్ తినాలి
జ. సూర్యోదయం అయ్ న 2.30 గం" లోపు.

6.ఉదయం పూట టిఫిన్ తో ఏమి త్రాగాలి
జ. ఫల రసాలు(fruit juice).

7. మధ్యానము భోజనం తర్వాత ఏమిత్రాగాలి
జ. లస్సీ, మజ్జిగ.

8. రాత్రి భోజనం తో ఏమి త్రాగాలి
జ. పాలు.

9. పుల్లటి ఫలములు ఎప్పుటు తినకూడదు
జ. రాత్రి.

10. ఐస్ క్రీం ఎప్పుడు తినాలి
జ. ఎప్పుడూ తినకూడదు.

11.ఫ్రిజ్ లోంచి తీసిన పదార్దాలు ఎంత సేపటికి తినవలెను
జ. గంట తర్వాత.

12. శీతల పానియాలు త్రాగవచ్చున( cool drink )
జ. త్రాగకూడదు.

13. వండిన వంటలను ఎంత సేపటిలో తినాలి
జ. 40 ని.

14.రాత్రి పూట ఎంత తినాలి
జ.  చాలా తక్కువగా, అసలు తిననట్టు.

15. రాత్రి భోజనం ఏ సమయంలో చేయాలి
జ. సూర్యాస్తమయం లోపు.

16. మంచినీళ్ళు భోజనానికి ఎంత ముందు త్రాగాలి
జ. 48 ని.

17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగవచ్చునా
జ. త్రాగకూడదు.

18. ఉదయం టిఫిన్ తిన్నాక ఏమిచేయాలి
జ. పని.

19.మధ్యాహ్నం భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. విశ్రాంతి తీసుకోవాలి.

20.రాత్రి భోజనం తర్వాత ఏమి చేయాలి
జ. 500 అడుగులు నడవాలి.

21. అన్ని వేళలా భోజనం చేసిన తర్వాత ఏమి చేయాలి
జ. వజ్రాసనం వేయాలి.

22. వజ్రాసనం ఎంత సేపు వేయాలి
జ. 5 - 10 ని.

23. ఉదయం లేచిన తర్వాత కళ్ళలో ఏమి వేయాలి
జ. లాలాజలం,( saliva ).

24. రాత్రి ఎన్నింటికి పడుకోవాలి
జ. 9 - 10 గం.

25. 3 విషముల పేర్లు
జ. పంచదార, మైదా, తెల్లటి ఉప్పు.

26. మధ్యాన్నం తినే కూరల్లో ఏమి వేసి తినాలి
జ. వాము.

27. రాత్రి పూట సలాడ్ తినవచ్చునా
జ. తినరాదు.

28. ఎల్లప్పుడూ భోజనం ఎలా చేయాలి
జ. క్రింద కూర్చుని మరియు బాగా నమిలి .

29. విదేశీ వస్తువులను కోనవచ్చునా
జ. ఎప్పుడూ కోనరాదు (Buy) .‌

30. టీ ఎప్పుడు త్రాగాలి
జ. అసలు ఎప్పుడు త్రాగకూడదు.

31. పాలలో ఏమి వేసుకుని త్రగాలి
జ. పసుపు.

32. పాలలో పసుపు వేసుకోని ఎందుకు త్రాగాలి
జ. క్యాసర్ రానివ్వకుండా ఉంటుంది.

33. ఏ చికిత్సా విధానం  మంచిది
జ. ఆయుర్వేదం.

34. వెండి, బంగారు పాత్రల్లో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. అక్టోబరు నుంచి మార్చ్ ( చలికాలంలో).

35. రాగి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. జూన్ నుంచి సెప్ట్ంబర్ ( వర్షాకాలంలో).

36. మట్టి పాత్రలో నీరు ఎప్పుడు త్రాగాలి
జ. మార్చ్ నుంచి జూన్ ( ఎండాకాలంలో).

37. ఉదయం పూట మంచినీరు ఎంత తీసుకోవాలి
జ. సుమారు 2,3 గ్లాసులు.

38. ఉదయం ఎన్ని గంటలకు నిద్రలేవాలి
జ. సూర్యోదయాని 1.30 ముందుగా.


దాల్చిన చెక్క ఉపయోగాలు .....

                                                 దాల్చిన చెక్క


 దాల్చిన చెక్క  పాలు తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పు.
దాల్చిన చెక్క పాల ఆరోగ్య ప్రయోజనాలను కొన్ని ఏళ్లుగా నిపుణులు స్టడీ చేస్తున్నారు. ఇది డయాబెటిస్ ని నివారిస్తుందని తేల్చాయి. ఈ పాలు ప్రిపేర్ చేయడం కూడా చాలా తేలిక. ఒక కప్పు వేడి పాలకు రెండు టీ స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం అంతే. డైలీ డైట్ లో దీన్ని చేర్చుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల డైజెషన్ ప్రాసెస్ మెరుగ్గా సాగుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ స్పామ్స్ ని ఇది స్మూత్ గా మార్చి, పొట్టలో వచ్చే అసౌకర్యాన్ని అరికట్టి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

టైప్ టు డయాబెటిస్ తో బాధపడేవాళ్లు దాల్చిన చెక్క పాలు రెగ్యులర్ గా తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

కంటినిండా నిద్రపోవాలని భావించేవాళ్లు.. దాల్చిన చెక్క పాలు తాగితే చాలు.. హ్యాపీగా నిద్రపోవచ్చు. కేవలం రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు తాగండి.. చిన్న పిల్లల్లా హ్యాపీగా నిద్రపోతారు.

దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల జుట్టు, చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఇది జుట్టుకి, చర్మానికి మంచిది.అందమైన కురులు, మెరిసే చర్మం పొందాలనుకునేవాళ్లు రెగ్యులర్ గా ఈ పాలు తాగడం మొదలుపెట్టండి.

వయసు పెరిగిన వాళ్లలో ఎముకలు బలంగా ఉండటానికి ఈ పాలు సహాయపడతాయి. రెగ్యులర్ గా దాల్చిన చెక్క పాలు తాగడం వల్ల వయసు పెరిగిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలకు దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దాల్చిన చెక్క కలిపిన పాలల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల పంటి సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది.క్యావిటీస్, ఓరల్ ప్రాబ్లమ్స్ దూరంగా ఉంటాయి.
సాధారణ దగ్గు, ఫ్లూ వంటివి నివారించడానికి ఈ పాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా.. హానికర బ్యాక్టీరియాను నివారించి.. హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది.

Thursday, 4 August 2016

మునగాకు ప్రయోజనాలు

                                            మునగాకు ప్రయోజనాలు 

 ఆ ఆకు వందల రోగాలను నయం చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఆకు ఓ ఔషధ నిధి. అదే మునగాకు. ఉచితంగా లభిస్తోంది కదా అని మునగాకును తేలిగ్గా తీసిపారేస్తున్నాం. కానీ దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఇకపై ఆ పని చేయరు.

మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య యోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని తేలింది. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. అసలు 4, 5 వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ఆయుర్వేదంలో 300లకు పైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు.



* మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ తింటే మాత్రమే వచ్చే విటమిన్ ఎ.. పది రెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు.

* పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది.

* పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

* అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు.

* మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది.

* థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు.

* మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తుందట.

* మునగాకుల రసాన్ని పాలలో కలపి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి.

* గర్భిణులు, బాలింతలకు కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు.

* పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

* గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి 5 నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.

* మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.

* మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి.

 * ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటి వారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ ఉంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది.

* వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలు..

నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రా, ఫ్యాట్స్ 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రా, కాల్షియం 440 మిల్లీ గ్రా, పాస్పరస్ 70 మిల్లీ గ్రా, ఐరన్ 7 మిల్లీ గ్రా, 'సి’ విటమిన్ 200 మి .గ్రా, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మి గ్రా, ఎనర్జీ  97 కేలరీలు ఉంటాయి.